రికార్డుస్థాయిలో పెరిగిన ధాన్యం ధర

ABN , First Publish Date - 2022-08-09T05:20:39+05:30 IST

రికార్డుస్థాయిలో పెరిగిన ధాన్యం ధర

రికార్డుస్థాయిలో పెరిగిన ధాన్యం ధర

 క్వింటాకు రూ.3,005    

 రైతుకు ఘనంగా సన్మానం 

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, ఆగస్టు 8 : మహబూబాబా ద్‌ వ్యవసాయ మార్కెట్‌లో సో మవారం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. జె ౖశ్రీరాం అనే రకం ధాన్యం క్విం టాకు రూ.3,005 అత్యధికంగా పలుకగా కనిష్ట రూ.1001 ధర పలికింది. సగటున రూ.1,950 ధర పలికింది. ఈనెల 3న అదే రకం ధాన్యం క్వింటాకు రూ.2, 222 ధర పలికింది. ఒక్కసారిగా ఎక్కడ లేని విధంగా మార్కెట్‌లో అత్యధికంగా ధర పలకడం విశేషం. రెడ్యాలకు చెందిన బి.లోక్య అనే రైతు 40 సంచులు జైశ్రీరాం రకం ధాన్యం తీసుకురాగా అనంత ట్రేడర్స్‌ అనే వ్యాపారులు అత్యధిక ధర కోడ్‌ చేసి ఆ ధాన్యాన్ని దక్కించుకున్నారు. దీంతో రైతును మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుధగాని మురళి, డైరెక్టర్లు ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, సీతారాం, హుస్సేన్‌, దేవిశ్యామల, మార్కెట్‌ సెక్రటరీ రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ఖాజాపాషాలు రైతుకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.  

Updated Date - 2022-08-09T05:20:39+05:30 IST