శునకం స్మారకార్థం చలివేంద్రం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-13T05:44:58+05:30 IST

శునకం స్మారకార్థం చలివేంద్రం ఏర్పాటు

శునకం స్మారకార్థం చలివేంద్రం ఏర్పాటు
గూడూరులో ఏర్పాటు చేసిన చలివేంద్రం

గూడూరు రూరల్‌, ఏప్రిల్‌ 12 : తన పెంపుడు శునకంపై ప్రేమ మరిచిపోలేక ఓ వ్యక్తి గూడూరు మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఆ శునకం పేరుమీద చలివేంద్రం ఏర్పాటు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన మేరెడ్డి చంద్రశేఖర్‌ కొన్ని సంవత్సరాల క్రితం ఓ శునకాన్ని తీసుకువచ్చి పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ శునకానికి చార్మ్‌ (పప్పి) అని పేరుపెట్టి ప్రేమగా చూసుకునేవాడు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో ఆ శునకం చనిపోవడంతో దానిపై ఉన్న ప్రేమను మరిచిపోలేక ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని గూడూరు సీఐ రాజిరెడ్డి, ఎస్సై సతీ్‌షల చేతుల మీదుగా ప్రారంభించాడు. కార్యక్రమంలో ఎంపీటీసీ నూకల రాధికసురేందర్‌, సాగర్‌, స్టాలిన్‌, నవనీత్‌, నవీన్‌, ముత్యం శ్రీను, దేవేందర్‌, సాజిత్‌, అఖిల్‌, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-13T05:44:58+05:30 IST