Abn logo
Oct 22 2021 @ 00:03AM

పోలీసుల త్యాగం అజరామరం

పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ శశాంక, ఎస్పీ కోటిరెడ్డి

 కలెక్టర్‌ శశాంక  

 ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

మహబూబాబాద్‌ రూరల్‌, అక్టోబరు 21 : పోలీసుల త్యాగం అజరామరమని కలెక్టర్‌ శశాంక అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. పోలీసు అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళ్లర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ శశాంక మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలు, వారు దేశానికి, ప్రజలకు చేసిన మేలు మరవలేనివని కొనియాడారు. అన్ని శాఖల కంటే పోలీసుశాఖ విధులు, బాధ్యతతో కూడినవని చెప్పారు. పోలీసుల వల్లే సమా జం శాంతి భద్రతల వల్ల నడుస్తుందని వారిని ప్రతీ ఒక్కరు గౌరవించాలన్నారు. పోలీసులు విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుం డా ప్రజలను, ప్రజాప్రతినిధులను కాపాడుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశంలో విధినిర్వహణలో 377 మంది సైనికులు వీరమరణం పొందారని, వారి త్యాగమూర్తుల కుటుంబాల రాక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మా ట్లాడుతూ.. 21 అక్టోబరు 1959 సంవత్సరంలో 20 మంది జవాన్లు కలిసి లడక్‌ ప్రాంతంలో హాట్‌స్ట్రింగ్‌ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా చైనా ఆర్మీ మన  సైనికులపై దాడి చేసి 10 మం దిని హతమార్చారని చెప్పారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విధి నిర్వాహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అమరులైన 377 మంది పోలీసుల పేర్లు ఉన్న పుస్తక్‌టోలి పుస్తకాన్ని కలెక్టర్‌ శశాంకకు అందించారు. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్లను నియంత్రించడం పోలీసు కర్తవ్యం, అంతర్గతభద్రత కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలను సైతం అర్పిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కబడ్డీ క్రీడలో ప్రథ మ స్థానంలో నిలిచిన కురవి జట్టుకు రూ.20వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన నెల్లికుదురు జట్టుకు రూ.10వేల నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యోగే్‌షగౌతమ్‌, డీఎస్పీలు సదయ్య, రేలా జనార్దన్‌రెడ్డి, సీఐలు జూపల్లి వెంకటరత్నం, రవికుమార్‌, ఎస్సైలు వెంకన్న, రమాదేవి, ఇమానియల్‌, గాలిబ్‌, అరుణ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.