Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్మికులకు మే డే శుభాకాంక్షలు: పవన్‌

అమరావతి: కార్మిక లోకానికి జనసేన తరపున మే డే శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ పురోగతిలో శ్రమ జీవుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మా శ్రమను గుర్తించండి అని కష్ట జీవులు.. పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదన్నారు. కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు కావాలన్నదే జనసేన ఆకాంక్ష అని పేర్కొన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికుల.. కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పవన్‌‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement