‘మద్యం తాగాక ఇంకేం భౌతిక దూరం పాటిస్తారు’.. లండన్‌లో..

ABN , First Publish Date - 2020-07-06T10:06:17+05:30 IST

యూకేలో మూడు నెలల తరువాత పబ్‌లు తెరుచుకోవడంతో వందలాది మంది

‘మద్యం తాగాక ఇంకేం భౌతిక దూరం పాటిస్తారు’.. లండన్‌లో..

లండన్: యూకేలో మూడు నెలల తరువాత పబ్‌లు తెరుచుకోవడంతో వందలాది మంది పబ్‌లకు క్యూ కట్టారు. వీరంతా కనీసం ఫేస్ మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. పబ్‌ల వద్ద గుమిగూడిన జనాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. మద్యం సేవించిన వారు భౌతిక దూరం పాటించాలన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారంటూ పోలీసులు మండిపడుతున్నారు. ఒకవ్యక్తి డ్రగ్స్ మత్తులో బట్టలు కూడా విప్పేసాడంటూ రాత్రి డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి చెప్పారు. మద్యం సేవించిన వారు ఇక ఫేస్‌మాస్క్ ఎందుకు ధరిస్తారు.. భౌతికదూరం ఎందుకు పాటిస్తారు అంటూ పోలీసు అధికారి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా మహమ్మారి గురించి అసలు ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మద్యం, భౌతిక దూరం అనేవి మంచి కలయిక కాదని ఇంగ్లాండ్ పోలీస్ యూనియన్ హెడ్ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా.. ప్రభుత్వం పబ్‌లు తెరిచేందుకు అనుమతిచ్చినప్పటికి.. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని నిబంధనలు పెట్టింది. అంతేకాకుండా ఆరుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని కూడా ఆదేశించింది. అయినప్పటికి పబ్‌ల వద్ద వందలాది మంది గుమిగూడి.. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

Updated Date - 2020-07-06T10:06:17+05:30 IST