మష్రూమ్‌ డక్సెల్లీస్‌

ABN , First Publish Date - 2022-02-26T18:08:07+05:30 IST

పుట్టగొడుగులు(మష్రూమ్‌) - 600గ్రా, చీజ్‌ - 200గ్రా, క్యాప్సికం - 200గ్రా, నూనె - అర లీటరు, మైదా - 100గ్రా, కోడిగుడ్లు - రెండు, బ్రెడ్‌ క్రంబ్స్‌ - 200గ్రా, ఉప్పు - తగినంత, తెల్లమిరియాలు - 10గ్రా.

మష్రూమ్‌ డక్సెల్లీస్‌

కావలసినవి: పుట్టగొడుగులు(మష్రూమ్‌) - 600గ్రా, చీజ్‌ - 200గ్రా, క్యాప్సికం - 200గ్రా, నూనె - అర లీటరు, మైదా - 100గ్రా, కోడిగుడ్లు - రెండు, బ్రెడ్‌ క్రంబ్స్‌ - 200గ్రా, ఉప్పు - తగినంత, తెల్లమిరియాలు - 10గ్రా.


తయారీ విధానం: ముందుగా మష్రూమ్‌లను శుభ్రంగా కడగాలి. తరువాత తరిగిన చీజ్‌, క్యాప్సికం ముక్కలను మష్రూమ్స్‌లో కూరాలి.ఒక బౌల్‌లో కోడిగుడ్లు పగలకొట్టి, మైదా, తెల్ల మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మష్రూమ్‌లను ఈ మిశ్రమంలో ముంచి, బ్రెడ్‌క్రంబ్స్‌ను అద్దుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మష్రూమ్‌లను వేసి వేయించాలి.  వీటిని టొమాటో సాస్‌తో సర్వ్‌ చేసుకోవాలి. 

Updated Date - 2022-02-26T18:08:07+05:30 IST