Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మసాలా తమలపాకుల వడలు

మసాలా తమలపాకుల వడలు

కావలసినవి: మసాలా తమలపాకులు - పన్నెండు, బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్‌, శనగపిండి - 4 టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, వాము - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కారం - రుచికి సరిపడా, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా తమలపాకులను శుభ్రంగా కడగాలి. ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, నువ్వులు, వాము, కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేయాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తమలపాకుపై లేయర్‌లా వేసి రోల్‌లా చుట్టాలి. రోల్‌ విడిపోకుండా పుల్లతో గుచ్చాలి. ఈ రోల్స్‌ను స్కిల్లెట్‌పై టోస్ట్‌ చేసుకోవాలి. తరువాత ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.



సోయా మంచూరియసోయా మంచూరియసోయా కబాబ్స్‌సోయా కబాబ్స్‌చిల్లీ గోబిచిల్లీ గోబిఆలూ బఠానీ చాట్‌ఆలూ బఠానీ చాట్‌పెసర వడలుపెసర వడలువడలువడలుచీజ్‌ పరోటాచీజ్‌ పరోటాచీజ్‌ నాన్‌చీజ్‌ నాన్‌చీజ్‌ దోశచీజ్‌ దోశచిల్లీ చీజ్‌ టోస్ట్‌చిల్లీ చీజ్‌ టోస్ట్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.