హైదరాబాద్: నగరంలో మరో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టనున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.