మారథాన్ రన్నర్‌కు జైలు
ABN , First Publish Date - 2020-04-04T09:36:16+05:30 IST
లాక్‌డౌన్ ఉన్నా నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించిన కెన్యా వరల్డ్ రికార్డ్ మాజీ మారథాన్ రన్నర్ విల్సన్ కిప్సాంగ్ జైలు పాలయ్యాడు. ఓ రిసార్ట్‌లో ...
నైరోబి (కెన్యా): లాక్‌డౌన్ ఉన్నా నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించిన కెన్యా వరల్డ్ రికార్డ్ మాజీ మారథాన్ రన్నర్ విల్సన్ కిప్సాంగ్ జైలు పాలయ్యాడు. ఓ రిసార్ట్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి, జూదం ఆడుతుండగా కిప్సాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రాత్రంతా జైలులో ఉంచారు. కిప్సాంగ్ కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో రూ.4 లక్షల వ్యక్తిగత పూచీకత్తు చెల్లించి బెయిల్‌పై విడుదలయ్యాడు. 2013 బెర్లిన్ మారథాన్ పోటీల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కిప్సాంగ్ స్వయంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ కావడం కొసమెరుపు.