సికింద్రాబాద్ ఘటనను ఖండించిన Maoist party

ABN , First Publish Date - 2022-06-20T23:25:49+05:30 IST

‘అగ్నిపథ్‌’ పథకాన్ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ ఘటనను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు.

సికింద్రాబాద్ ఘటనను ఖండించిన Maoist party

హైదరాబాద్: ‘అగ్నిపథ్‌’ పథకాన్ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ ఘటనను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని చేశారు. రాకేష్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని జగన్ డిమాండ్ చేశారు. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్‌’పై.. ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయిన విషయం తెలిసిందే. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా.. జరిగిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు, ఆర్పీఎఫ్‌ సిబ్బందికి గాయాలయ్యాయి.

Updated Date - 2022-06-20T23:25:49+05:30 IST