ఆలస్యంగా నడుస్తున్న వందలాది IndiGo సర్వీసులు.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-07-03T23:42:51+05:30 IST

ఇండిగో(IndiGo)కు చెందిన దేశీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేవలం 45 శాతం సర్వీసులు మాత్రమే సమయానుగుణంగా బయలుదేరుతున్నాయి. ఈ

ఆలస్యంగా నడుస్తున్న వందలాది IndiGo సర్వీసులు.. కారణం ఇదే..

న్యూఢిల్లీ : ఇండిగో(IndiGo)కు చెందిన దేశీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేవలం 45 శాతం సర్వీసులు మాత్రమే సమయానుగుణంగా బయలుదేరుతున్నాయి. ఈ పరిస్థితికి సిబ్బంది కొరతే కారణమని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అనారోగ్య కారణాల రీత్యా గణనీయ సంఖ్యలో క్యాబిన్ సిబ్బంది సెలవు పెట్టారు. మరికొందరు ఎయిరిండియా(Air India) రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కి వెళ్లారని సమాచారం. ఎయిరిండియా రెండవ దశ నియామక ప్రక్రియ శనివారం జరిగింది. సెలవులు పెట్టిన ఇండిగో క్యాబిన్ సిబ్బంది(crew members)లో అత్యధికులు ఎయిరిండియా రిక్రూట్‌మెంట్‌కి వెళ్లారని తెలిపారు.


పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండడంపై వివరణ ఇవ్వాలంటూ ఇండిగోని డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కోరింది. దేశవ్యాప్తంగా సర్వీసులు ఆలస్యంగా నడవడానికి కారణం ఏంటో చెప్పాలని అధికారులు ప్రశ్నించారు. కాగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఇండిగో మొత్తం 1600 విమానాలను నడుపుతోంది. ఇందులో సగానికిపైగా విమానాలు శనివారం ఆలస్యంగా నడిచాయి. సర్వీసుల ఆలస్యంపై ఇండిగో ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.


శనివారం సమయానుగుణంగా సర్వీసులు నడిపిన విమానయాన సంస్థల(Air Lines) విషయానికి వస్తే.. ఇండిగో(IndiGo) 45.2 శాతం, ఎయిరిండియా(Air India) 77.1 శాతం, స్పైస్‌జెట్(Spice Jet) 80.4 శాతం, విస్తారా (Vistara) 86.3 శాతం, గో ఫస్ట్ (Go First) 88 శాతం, ఎయిర్ ఏసియా ఇండియా(Air Asia India) 92.3 శాతం సమయ పాలనను పాటించాయి.

Updated Date - 2022-07-03T23:42:51+05:30 IST