పెద్దోళ్ల ఆటలో చిన్నోడు శతక్కొట్టాడు

ABN , First Publish Date - 2020-08-12T09:17:43+05:30 IST

వయస్సు 12 ఏళ్లే.. అయితే, ఆడేది మాత్రం సీనియర్‌ జట్టులో.. అంతేనా తన అసాధారణ ప్రతిభతో థామస్‌ రూ ఏకంగా..

పెద్దోళ్ల ఆటలో చిన్నోడు శతక్కొట్టాడు

లండన్‌: వయస్సు 12 ఏళ్లే.. అయితే, ఆడేది మాత్రం సీనియర్‌ జట్టులో.. అంతేనా తన అసాధారణ ప్రతిభతో థామస్‌ రూ ఏకంగా అజేయ శతకం (113 నాటౌట్‌) బాది జట్టును గెలిపించాడు. మన్‌మౌత్‌ సైంటిఫిక్‌ సోమర్సెట్‌ లీగ్‌లో ఈ అరుదైన ఫీట్‌ నమోదైంది. తద్వారా ఈ లీగ్‌లో అత్యంత పిన్న వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడయ్యాడు. గత శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 12 ఏళ్ల థామస్‌ రూ... టాంటన్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ ’బి’ తరఫున బరిలోకి దిగాడు. సోమర్సెట్‌ అండర్‌-13 ఆటగాడైన థామస్‌ పురుషుల క్రికెట్‌లో ఆడేందుకు అనుమతించడంతో ఇక్కడా తన సత్తా చాటుకున్నాడు. కెప్టెన్‌ హకీతో కలిసి తొలి వికెట్‌కు 140 పరుగులు జత చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated Date - 2020-08-12T09:17:43+05:30 IST