Tokyo Para olympics:షూటింగ్ ఈవెంట్‌లో భారత్‌కు పతకాల పంట

ABN , First Publish Date - 2021-09-04T15:12:02+05:30 IST

జపాన్ దేశంలోని టోక్యో నగరంలో శనివారం జరిగిన పోటీల్లో షూటర్లు మనీష్ నర్వాల్, సింఘరాజ్ అదానాలకు రెండు పతకాలు సాధించారు....

Tokyo Para olympics:షూటింగ్ ఈవెంట్‌లో భారత్‌కు పతకాల పంట

మనీష్‌కు స్వర్ణం, సింఘరాజ్‌కు రజతం 

టోక్యో (జపాన్): జపాన్ దేశంలోని టోక్యో నగరంలో శనివారం జరిగిన పోటీల్లో షూటర్లు మనీష్ నర్వాల్, సింఘరాజ్ అదానాలు రెండు పతకాలు సాధించారు. టోక్యోలో శనివారం జరిగిన పురుషుల పి 4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్ హెచ్ 1 పోటీల్లో మనీష్ నర్వాల్ బంగారు పతకం, సింఘరాజ్ అదానా రజతపతకం సాధించారు.దీంతో టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు.ఇప్పటివరకు భారత్ కు పారా ఒలింపిక్స్ లో 15 పతకాలు వచ్చాయి.



 19 ఏళ్ల షూటర్ మనీష్ పారా ఒలింపిక్ రికార్డు సృష్టించాడు. మనీష్ బంగారు పతకం కైవసం చేసుకోవడానికి 218.2 పాయింట్లు సాధించాడు,.సింఘరాజ్ 216.7 పాయింట్లతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో తన రెండవ పతకాన్ని సాధించాడు. రష్యన్ పారాలింపిక్ కమిటీ సెర్గీ మలిషేవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.సింఘరాజ్ అధనా ఫైనల్‌లో మొదటి 10 షాట్ల తర్వాత 92.1 పాయింట్లను సంపాదించాడు.

Updated Date - 2021-09-04T15:12:02+05:30 IST