Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. Kuwait కీలక నిర్ణయం!

కువైత్ సిటీ: వలసదారులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీపై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఇకపై వలసదారులు ప్రతియేటా 130 కువైటీ దినార్లు(రూ.32,276) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రెండేళ్లకు ఒకసారి 20 కేడీలు(రూ.4,965) పెంచడం జరుగుతుంది. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతి మనిషికి 190 కువైటీ దినార్ల(రూ.47,173)కు ఫ్రీజ్ చేస్తారు. ఈ మేరకు హెల్త్ అస్సూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ(ధామన్) సీఈఓ థామర్ అరబ్ వెల్లడించారు. ఈ కొత్త ధామన్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి రెసిడెంట్‌కు తప్పనిసరి అని ఈ సందర్భంగా థామర్ అరబ్ వెల్లడించారు. ఈ పాలసీలో రెసిడెంట్‌కు కావాల్సిన ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అన్ని అవసరాలను కవర్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అందించే వైద్య సలహా, డయాగ్నసిస్, చికిత్స, మందులు ఇలా ప్రతిది ఇందులో ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఆరోగ్యశాఖ నివాసితులకు అందిస్తున్న 50 కేడీల(రూ.12,413) తప్పనిసరి ఇన్సూరెన్స్ పాలసీ స్థానంలో ఈ కొత్త పాలసీని తీసుకువస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement