Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

భయంకరమైన తప్పు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో జరిగింది

twitter-iconwatsapp-iconfb-icon
భయంకరమైన తప్పు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో జరిగింది

ఆర్కే : హి కెనాట్‌ రీప్లేసా?

మోహన్‌బాబు : అది నాకు తెలియదు. 


ఆర్కే : చిరంజీవి తరపున నాగబాబు కొన్ని వీడియోలు పెట్టాడు. మోహన్‌బాబు అలా ఎందుకు మాట్లాడాడు అని?

మోహన్‌బాబు : తప్పుగా ఏం మాట్లాడలేదు. భయంకరమైన తప్పు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో జరిగింది. బిల్డింగ్‌ కావాలనుకున్నారు, కొన్నారు. 100 రూపాయాలకు కొన్నారు, 50 రూపాయలకు అమ్మారు. మళ్లా బిల్డింగ్‌ అంటున్నారు. ఇది న్యాయమా? అని అడిగాను. మీరు అడగరా?


ఆర్కే : ఎవరైనా అడుగుతారు? 100 కొనడం ఎందుకు? 50కి అమ్మడం ఎందుకు? 

మోహన్‌బాబు : అంతే!


ఆర్కే : ఎవరు అమ్మారు?

మోహన్‌బాబు : అది నాకు తెలియదు. కొనేముందే అందరికీ తెలియాలి. సరైన ప్లేస్‌లో, సరైనది తీసుకుంటున్నామా లేదా అని చూసుకోవాల్సింది.


ఆర్కే : మీ భాషలో చెప్పాలంటే సినిమా పెద్దలు...

మోహన్‌బాబు : ఎగతాళా! ఇప్పుడు సినిమా పెద్దలు ఎవరూ లేరు. దాసరిగారితోనే అది పోయింది. 


ఆర్కే : చిరంజీవి ట్రై చేస్తున్నాడుగా?

మోహన్‌బాబు : అది నాకనవసరం. 


ఆర్కే : హి కెనాట్‌ రీప్లేసా?

మోహన్‌బాబు : అది నాకు తెలియదు. 


ఆర్కే : దాసరిగారి పోయాక ఇండస్ట్రీలో పెద్దలు అనే పదం లేదు అంటారు?

మోహన్‌బాబు : లేదు, లేదు, లేదు, రాదు, రాదు, రాబోదు.


ఆర్కే : ఎవరైనా సినీ పెద్దలమని ప్రకటించుకున్నా, వాళ్లు పెద్దలు కాదు.. అంతేనా?

మోహన్‌బాబు : అని నేను అనను. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తా. 


ఆర్కే: అకార్డింగ్‌ టు మోహన్‌బాబు సినీ పెద్దలు లేరు అంతేనా?

మోహన్‌బాబు : అంతే !


ఆర్కే : విష్ణు ‘మా’ బిల్డింగ్‌ను సొంత ఖర్చుతో కట్టిస్తానని అన్నాడు కదా!

మోహన్‌బాబు : ఇన్ని సంవత్సరాలలో మోహన్‌బాబు మాట తప్పాడా? ఇప్పుడు కూడా కట్టిస్తాడు. ‘‘మా’ కోసం బిల్డింగ్‌ కావాలంటున్నారు. అది నేను కట్టిస్తా. సినిమా పెద్దలను కలిసి ఏకగ్రీవం చేయమనండి’ అని విష్ణుబాబు అడిగాడు. పెద్దలెవరూ స్పందించలేదు. కృష్ణంరాజు గారు సీనియర్‌. కానీ ఆయన డిసిప్లినిరీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేదు. కృష్ణగారు ఉన్నారు. ఆయన ఇవన్నీ పట్టించుకోడు. నేను వెళ్లి కలిశాను. ఆయనంటే నాకు బాగా ఇష్టం. ఆయన చెప్పేవాడు ‘మోహన్‌బాబును విలన్‌గా పెట్టండి’ అని. నన్ను భక్త అనేవాడు. విష్ణుని తీసుకెళ్లి కలిశా. బ్లెస్సింగ్స్‌ తీసుకొమ్మని విష్ణుకి చెప్పా.


ఆర్కే : పనిలో పనిగా చిరంజీవి ఇంటికి వెళ్లొచ్చు కదా!

మోహన్‌బాబు : తప్పుకాదు. వెళ్లొచ్చు.


ఆర్కే : మరి ట్రై చేయండి?

మోహన్‌బాబు : ఎమని?


ఆర్కే : మా వాడికి బ్లెస్సింగ్స్‌ ఇవ్వండని...

మోహన్‌బాబు : ఎందుకు?


ఆర్కే : స్నేహితుడు కదా!

మోహన్‌బాబు : తప్పులేదు. ఇంత జరగకపోతే కలిసేవాణ్ణి. 


ఆర్కే : మా ఎన్నిక పుణ్యమా అంటూ మీ ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం వాడిపోయి, పాత శతృత్వం మొగ్గతొడిగిందని మేము అనుకోవచ్చా?

మోహన్‌బాబు : నో ఆన్సర్‌.


ఆర్కే : చాలు. మీ సినిమాల్లో మౌనమే అర్ధాంగీకారం అని డైలాగ్‌ ఉంది.

మోహన్‌బాబు : చిరంజీవికి ఫోన్‌ చేసి చెప్పు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, కృష్ణంరాజు.. వీళ్లకు ఫోన్‌ చేసి చెప్పు అంటే విష్ణుబాబు నా ముందు ప్రయత్నం చేశాడు. కొంతమంది ఫోన్‌లో దొరకలా! ఆ తరువాత ఎన్నో పనులు. మాటంటే మాటే. ముందు చెప్పమని చెప్పాను. 


ఆర్కే : కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలు మా బిల్డింగ్‌ కోసం ఇంత యాగీ చేయడం అవసరమా? రెమ్యునరేషన్‌ ఏటా 5 శాతం తీసి పక్కన పెడితే పెద్ద బిల్డింగ్‌ కట్టుకోవచ్చు కదా!

మోహన్‌బాబు : వాస్తవమే. కట్టుకోవచ్చు. నేను మా అధ్యక్షునిగా ఉన్నప్పుడు బిల్డింగ్‌ కొనాలకున్నాం. క్రికెట్‌ మ్యాచ్‌ను నిర్వహించి ఫండ్స్‌ కలెక్ట్‌ చేశాం. అమితాబ్‌ వచ్చారు. చంద్రబాబుకు నేను స్వయంగా ఫోన్‌ చేశాను రమ్మని. కానీ ఎందుకో డబ్బులు చాలలేదు, కొనలేకపోయాం. ఇప్పుడు హీరోలందరూ తలా కాస్త డబ్బు వేస్తే మంచి బిల్డింగ్‌ కట్టుకోవచ్చు.


ఆర్కే : మీ సొంత మనిషి, సొదరి సమానురాలు జయసుధ ఈ క్యాంప్‌ నుంచి ఆ క్యాంప్‌కు జంప్‌ అయిపోయారు కదా! 

మోహన్‌బాబు : ఆ అమ్మాయి నమ్ముకున్న దేవుణ్ణి అడిగితే సమాధానం చెబుతాడు. 


ఆర్కే : కుటుంబసమస్యలు వచ్చినప్పుడు సొంత చెల్లెలా పోయే వారు కదా!

మోహన్‌బాబు : మీ అందరికీ తెలుసు. 


ఆర్కే : అడగలేదా?

మోహన్‌బాబు : అడిగాను. నేను ఆ పక్కన ఉండాలని అనుకుంటున్నాను అంది. సొంత అన్నదమ్ములే విడిపోతున్నారు. ఈ మధ్య అనిపించింది. ఇది కూడా స్నేహమా? అని. డిటైల్స్‌కి వెళ్లకండి. అటు రాజకీయంగానూ, సినిమాపరంగానూ జరిగింది. నమ్మకద్రోహం. ఇలాగా కూడా జరుగుతుందా? ఇలాగా కూడా ఉంటారా? అనిపించింది.


ఆర్కే : ఇండస్ట్రీలో మీకున్న టైటిల్‌ ఏంటి? మోహన్‌బాబు మనసు చాలా మంచిది. ఏదీ దాచుకోడు. కానీ నోరే.. అంటారు. నిజమా కాదా?

మోహన్‌బాబు : అంటారు. మీరు ఒక ప్రశ్న అడిగారు. నేను సమాధానం చెప్పకుండా మౌనం వహించా. కొన్నిటికి చెప్పగలిగాను. ఆ చెప్పగలిగిన వాటిల్లోకూడా ఇతరుల మనసుకు కష్టం కలిగించేవి ఉండొచ్చు. అప్పుడేమంటారు? వాడికి నోటి దూలరా? అందుకే అలా మాట్లాడాడు అని అంటారు. మాట్లాడితే తప్పు. మాట్లాడకపోతే తప్పు. సన్నాఫ్‌ ఇండియా సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ఇండియాలో న్యాయం జరగదా? అని హీరోయిన్‌ అడుగుతుంది. అప్పుడు ‘ఒక అమ్మాయిని లారీ క్లీనర్‌రేప్‌ చేస్తే వెంటనే ఎన్‌కౌంటర్‌ చేస్తారు. మనమంతా శభాష్‌ అని చప్పట్లు కొట్టి భుజాలు ఎగరేసుకుంటాం. అదే బడాబాబులు, వాళ్లకు పుట్టిన బుడ్డబాబులు రేప్‌ చేస్తే 24 ఏళ్లయినా న్యాయం జరగదు. దటీజ్‌ అవర్‌ ఇండియా’ అని చెప్పా. ‘కొంతమంది రాజకీయనాయకులు తమకు కావలసిన రౌడీలను సత్ప్రవర్తన కింద విడిపించుకోవడానికి ఆగస్టు15న జెండా ఎగరేయడానికి జైలుకు వెళతారు. దటీజ్‌ అవర్‌ ఇండియా’ ఈ డైలాగ్‌ చెబితే కొంతమంది మిత్రులు ‘అలా చెప్పారేంటి’ సర్‌ అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు. అందుకే ఎవరు ఎక్కడన్నా పోనీ మన బతుకు మనం బతుకుదాం అనిపిస్తుంటుంది. మాట్లాడితే నోటి దురద అంటారు. ఇప్పుడు ఎవడి కర్మన వాడుపోనీ అని కొన్ని సందర్భాల్లో అసమర్ధుడిగా జీవిస్తున్నా. పోరాడే తత్వం మనిషికి ఉండాలి. కానీ పోరాడి అలసిపోయా. మనసుకు కష్టమై! 


ఆర్కే : మీ క్యాంప్‌లో ఉండాల్సిన జీవిత కూడా అటెందుకు వెళ్లిపోయింది?

మోహన్‌బాబు : ఆ అమ్మాయి ఇష్టం. మా క్యాంప్‌లోనే ఉండాలని ఎవరన్నారు. 


ఆర్కే : విష్ణు గెలవడం తథ్యం అంటారు?

మోహన్‌బాబు : యస్‌! తథ్యం, తథ్యం, తథ్యం. సోదరుడు బాలకృష్ణ కూడా సపోర్టు చేశాడు. 


ఆర్కే : అలాగే ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడం తథ్యం అనండి?

మోహన్‌బాబు : ఇతరుల పేర్లు నేనెందుకు అనాలి. అపోజిషన్‌ పార్టీ ఓడిపోతుంది. నేను వద్దు అనుకున్నప్పుడు వాళ్ల పేర్లు ఉచ్చరించడం ఇష్టం ఉండదు. 


ఆర్కే : సినిమాల్లో బాగా డబ్బు సంపాదించిన వారు సినిమాలు తీసి దెబ్బతిన్నారు. మరి మోహన్‌బాబు..

మోహన్‌బాబు : సంపాదించాను. నష్టపోయాను. ఐదు సినిమాలు సూపర్‌హిట్‌ అయినా, ఒక్క సినిమా ఫెయిల్‌ అయితే మొత్తం పోతుంది. నాకు ఆ పరిస్థితి రాలేదు. 


ఆర్కే : ఆ పరిస్థితి రాకముందే నిర్మాతగా తప్పుకుంటావా? 

మోహన్‌బాబు : నో. సన్నాఫ్‌ ఇండియా హిట్టవుతుంది. విష్ణుతో రెండు సినిమాలు చేస్తున్నా. నిర్మాతగా తప్పుకోను. సినిమాలు తీస్తూనే ఉంటాను. భారతదేశ చలనచిత్ర చరిత్రలో నటుడిగా, నిర్మాతగా నేనే నంబర్‌వన్‌. నిర్మాతగా కొనసాగుతాను. నటుడిగా కొనసాగుతాను. భారతదేశంలో నా ఇన్‌స్టిట్యూషన్స్‌ నంబర్‌వన్‌ కావాలని కృషి చేస్తున్నా. మా విద్యాసంస్థల్లో చదువుకున్న పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ల పిల్లలు కూడా మళ్లీ మా విద్యాసంస్థల్లో చదువుతున్నారు. ఇది గర్వంగా చెప్పగలను. 


ఆర్కే : మీరు కోరుకున్నట్టుగా మీ విద్యాసంస్థ దేశంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందాలని, నటుడిగా, నిర్మాతగా మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ థ్యాంక్యూ  సోదరా!

మోహన్‌బాబు : మీకు నా హృదయపూర్వక నమస్కారాలు.


దాసరి తర్వాత సినీ పెద్దను నేనే అని ఎవరైనా ప్రకటించుకుంటే..part 1

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.