గూగుల్ మ్యాప్స్‌నే నమ్ముకున్నాడు.. ఆ రూట్‌లోనే దూసుకుపోయాడు.. చివరికి జరిగిందేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-02T00:08:29+05:30 IST

ఆధునిక సాంకేతికత మన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఫలితంగా.. ఒకప్పటి కష్టమైన పనులన్నీ ఇప్పుడు ఎంతో సులువుగా అయిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ లేనిదే ఒక్క క్షణం కూడా గడవదన్న అభిప్రాయం కూడా కలుగుతుంది.

గూగుల్ మ్యాప్స్‌నే నమ్ముకున్నాడు.. ఆ రూట్‌లోనే దూసుకుపోయాడు.. చివరికి జరిగిందేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సాంకేతికత మన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఫలితంగా.. ఒకప్పటి కష్టమైన పనులన్నీ ఇప్పుడు ఎంతో సులువుగా అయిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ లేనిదే ఒక్క క్షణం కూడా గడవదన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కానీ.. టెక్నాలజీపై ఇలా అతిగా ఆధారపడటం వల్ల ఒక్కోసారి ఊహించని ఘటనలు జరగుతుంటాయి. అఫ్రికా ఖండంలోని ఘానా దేశానికి చెందిన ఓ వ్యక్తికి అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా..ప్రస్తుతం ఈ పోస్ట్ తెగవైరల్ అవుతోంది. 


ఆల్ఫ్ర్‌డ్ అనే వ్యక్తి ఓ కొత్త ప్రదేశానికి వెళ్లే క్రమంలో గూగుల్ మాప్స్ సహాయం తీసుకున్నాడు. మ్యాప్స్‌లో కనిపించిన మార్గంలోనే పయనించాడు. మొదట్లో అంతా సవ్యంగా సాగినట్టు అనిపించినా ఆ తరువాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మ్యాప్స్ చూపించిన మార్గాల్లో వెళ్లగా పలుమార్లు తుప్పలు ఎదురయ్యాయి. అక్కడి నుంచి ఎలాగొలా బయటపడి..మళ్లీ రోడ్డెక్కాడు. కాసేపు ఓపికపడితే..గూగుల్ మ్యాప్స్ సరైన మార్గం చూపిస్తుందనేది అతడి ఆశ. కానీ..అతడు ఊహించింది జరగలేదు. ఎడమవైపు తిరిగే మీ గమ్య స్థానం వస్తుందని గూగుల్ చెప్పడంతో అటువైపు తిరగబోయిన అతడికి భారీ షాక్ తగిలింది. తన గమ్యస్థానానికి బదులు  అక్కడ ఓ పెద్ద మామాడి చెట్టు కనిపించడంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. ఆ తరువాత దారిన పోయే వారి సాయంతో తాను వెళ్లాల్సిన చోటుకు చేరుకున్నాడు. అయితే.. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి అతడు ఇటీవలే ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఇటువంటి పరిస్థితులు తమకూ ఎదురయ్యాయంటూ రిప్లై ఇచ్చారు.   



Updated Date - 2022-01-02T00:08:29+05:30 IST