Advertisement
Advertisement
Abn logo
Advertisement

గోడ వెనకాల ఇరుక్కుపోయిన వ్యక్తి.. నగ్నంగా రెండు రోజుల పాటు.. అగ్నిమాపక సిబ్బందికి షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: గోడలోంచి ఏదో శబ్దం.. ఎవరో పెద్దగా తడుతున్నట్టు చప్పుడు.. తొలుత ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.కొంత సేపటి తరువాత..అక్కడున్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి గోడ వెనుక ఇరుక్కుపోయాడని, రెండు రోజుల పాటు నగ్నంగా అలాగే గడిపాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. న్యూయార్క్‌లోని సిరాక్యూస్ ప్రాంతంలోగల ఓ థియేటర్‌లో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అగ్నిమాప సిబ్బంది గోడకు రధ్రం చేసి..అతడిని బయటకు తీశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ వారు ఈ విషయాలను ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. 

అంతకు రెండు రోజుల మునుపే అతడు థియేటర్‌లోకి ప్రవేశించి ఉంటాడని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. అతడు థియేటర్‌లో సంచరిస్తున్న విషయాన్ని సీసీటీవీలో గమనించిన అక్కడి సిబ్బంది అతడి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో..అతడు వెళ్లిపోయి ఉంటాడని భావించారు. కానీ..రెండు రోజుల తరువాత ఇలా ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. తాము వెతికిన వ్యక్తి ఇలా చిక్కుకుపోయాడని తెలిసి సిబ్బంది కూడా అవాక్కయ్యారు.

బయటి చలి నుంచి తప్పించుకునేందుకో లేక బాత్రూమ్‌కు వెళ్లేందుకో అతడు థియేటర్‌లోకి వచ్చి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు గోడల మధ్య ఉండే సందుల్లో దూరి చివరికి ఇలా ఇరుక్కుపోయి ఉంటాడనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అతడికి మతిస్థిమితం సరిగా లేకపోడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనానికి దారితీసింది.

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement