నడిరోడ్డుపై ఈతకొట్టేశాడు.. హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

ABN , First Publish Date - 2020-10-10T19:36:37+05:30 IST

ఒక్క అరగంట వర్షం నాన్ స్టాప్‌గా పడిందంటే ఇక అంతే సంగతి. హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. నడిరోడ్డుపై ఈత కొట్టడం ఒకటే తక్కువ. ఆ కలను ఈ యువకుడు సాకారం చేసుకున్నాడు.

నడిరోడ్డుపై ఈతకొట్టేశాడు.. హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

హైదరాబాద్: ఒక్క అరగంట వర్షం నాన్ స్టాప్‌గా పడిందంటే ఇక అంతే సంగతి. హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. నడిరోడ్డుపై ఈత కొట్టడం ఒకటే తక్కువ. ఆ కలను ఈ యువకుడు సాకారం చేసుకున్నాడు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని టోలీ చౌకీలో ఓ రోడ్డు నీట మునిగింది. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో అక్కడున్న ఓ యువకుడు  ఈత కొట్టడం మొదలుపెట్టాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో కొట్టినట్టుగానే ఆ యువకుడు ఈత కొట్టడంతో అక్కడున్న వారు వీడియోలు, ఫొటోలు తీయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


ఇదిలా ఉంటే, వాన చినుకులు పడ్డాయంటే రోడ్డుపైకి రావాలంటేనే భయమేస్తోందని నగరవాసులు అంటున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జామ్ అయిపోయాయి. నీళ్లు రోడ్లపై నిలిచిపోవడంతో... ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులకు నరకం కనిపించింది. బంజారాహిల్స్ నుంచి ఎల్బీ నగర్ చేరుకోవడానికి  3 - 4 గంటల సమయం పట్టిందని వాహనదారులు అంటున్నారు.   

Updated Date - 2020-10-10T19:36:37+05:30 IST