అమ్మకాలను పెంచుకునేందుకు ఏకశిలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారి.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-12-06T04:05:47+05:30 IST

గత కొద్ది రోజులుగా ఏకశిలలకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

అమ్మకాలను పెంచుకునేందుకు ఏకశిలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారి.. అమెరికాలో..

పిట్స్‌బర్గ్: గత కొద్ది రోజులుగా ఏకశిలలకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఓ ఏడారిలో కొద్ది రోజుల క్రితం ఏకశిల ప్రత్యక్షమైంది. కొద్ది గంటల్లోనే మళ్లీ అక్కడి నుంచి ఆ ఏకశిల మాయమైపోయింది. ఉన్నట్టుండి యూరప్‌లోని రొమానియాలో అదే తరహా ఏకశిలను కొంతమంది గుర్తించారు. ఈ ఏకశిల కనిపించిన ప్రదేశంలో ఏం చేయాలన్నా అధికారుల అనుమతి తప్పక పొందాల్సి ఉంటుంది. మరి అధికారులను సంప్రదించకుండా అక్కడ ఏకశిలను ఎవరు పెట్టారన్నది ఇప్పటికీ ప్రశ్నగానే ఉండిపోయింది. ఇలా ఒక దేశంలో ప్రత్యక్షమై.. మళ్లీ మాయమై.. మరోదేశంలో ఏకశిలలు కనిపిస్తుండటంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.


ఈ రకంగా ఏకశిలల వార్త ట్రెండింగ్ అయిపోవడంతో.. ఏకశిల ద్వారా తన వ్యాపారాన్ని పెంచుకోవాలని ఓ అమెరికన్ నిర్ణయించుకున్నాడు. క్రిస్టోఫర్ బీర్స్ అనే పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన వ్యాపారి తన క్యాండీ స్టోర్ ముందు మెటల్ ఏకశిలను ఏర్పాటు చేశాడు. పది అడుగుల ఎత్తు, 24 అంగుళాల వెడల్పు ఉన్న ఏకశిలను స్టోర్ ముందు పెట్టడంతో అటుగా వెళ్లే వారంతా దాన్ని చూసేందుకు ఆగుతున్నారు. ఇదే సమయంలో తన క్యాండీ స్టోర్‌కు వెళ్లి క్యాండీలను కూడా కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - 2020-12-06T04:05:47+05:30 IST