ముక్కులో నాణాన్ని పెట్టుకుని మర్చిపోయిన వ్యక్తి.. 50ఏళ్ల తర్వాత!

ABN , First Publish Date - 2020-11-29T21:39:33+05:30 IST

ఓ వ్యక్తి 50 సంవత్సరాల క్రితం తన ముక్కులో పెట్టుకున్న నాణాన్ని డాక్టర్లు తొలగించిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన 6వ ఏట ముక్కులో నాణాన్ని పెట్టుకున్నా

ముక్కులో నాణాన్ని పెట్టుకుని మర్చిపోయిన వ్యక్తి.. 50ఏళ్ల తర్వాత!

మాస్కో: ఓ వ్యక్తి 50 సంవత్సరాల క్రితం తన ముక్కులో పెట్టుకున్న నాణాన్ని డాక్టర్లు తొలగించిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన 6వ ఏట ముక్కులో నాణాన్ని పెట్టుకున్నాడు. ఆ విషయాన్ని సదరు వ్యక్తి మర్చిపోయాడు. ఈ క్రమంలో దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులను సంప్రదించాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు అతని ముక్కులో ఓ నల్లటి లోహం ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఎండోస్కోపిక్ సర్జరీ చేసి శుక్రవారం రోజు దాన్ని తొలగించారు. ఈ క్రమంలో స్పందించిన సదరు  వ్యక్తి.. తన 6వ ఏట ముక్కులో ఓ నాణాన్ని పెట్టుకున్నాని.. అనంతరం ఆ విషయమే మర్చిపోయానని చెప్పాడు. ప్రస్తుతం ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోగలుతున్నట్లు పేర్కొన్నాడు. కాగా.. దాన్ని సోవియేట్ వన్ కోపెక్ నాణంగా గుర్తించారు. 


Updated Date - 2020-11-29T21:39:33+05:30 IST