కరోనా వేళ మాస్క్ ధరించని వ్యక్తి అరెస్ట్.. పిచ్చాసుపత్రికి తరలింపు!

ABN , First Publish Date - 2021-08-09T16:40:54+05:30 IST

కరోనా విజృంభిస్తుణ వేళ మాస్క్‌ను లెక్కచేయని చాలా మంది మహానుభావులు కటకటాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వార్తలను ఇప్పటి వరకు చాలానే విని ఉంటారు. అయితే మాస్క్ ధరిం

కరోనా వేళ మాస్క్ ధరించని వ్యక్తి అరెస్ట్.. పిచ్చాసుపత్రికి తరలింపు!

సింగపూర్: కరోనా విజృంభిస్తుణ వేళ మాస్క్‌ను లెక్కచేయని చాలా మంది మహానుభావులు కటకటాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వార్తలను ఇప్పటి వరకు చాలానే విని ఉంటారు. అయితే మాస్క్ ధరించని వ్యక్తి.. పిచ్చాసుపత్రిపాలైన ఘటన గురించి బహుశా మీరు ఎక్కడ చదవి ఉండకపోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో వైద్య నిపుణుల సూచనల మేరకు దాదాపు అన్ని దేశాలూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా దేశాలు మాస్క్‌ విషయంలో ఆంక్షలను సడలించాయి. కానీ సింగపూర్ మాత్రం మాస్క్ విషయంలో నిబంధనలను కఠినంగానే అమలు చేస్తోంది.



కాగా.. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న బ్రిటన్‌కు చెందిన బెంజమిన్ గ్లిన్‌‌కు మాస్క్ ధరించడం అస్సలు ఇష్టం లేదు. కరోనాను వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్క్ విఫలమైందని అతను గట్టిగా విశ్వసిస్తున్నాడు. దీంతో మాస్క్ పెట్టుకోవడాన్ని మానేశాడు. గత మేలో ట్రైన్‌లో వెళ్తున్న గ్లిన్‌కు తోటి ప్రయాణికులు మాస్క్ పెట్టుకోవాల్సిందిగా సూచించారు. దానికి అతను నిరాకరించాడు. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది పోలీసుల దృష్టికి వెళ్లడం వాళ్లు వచ్చి ట్రైన్‌లో ఉన్న గ్లిన్‌ను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం గ్లిన్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో అతని వాదన విన్న కోర్టు.. గ్లిన్‌ను పిచ్చాసుపత్రికి తరలించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఈ వార్త సింగపూర్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. 


Updated Date - 2021-08-09T16:40:54+05:30 IST