హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేటలో కొత్త షోరూమ్ ప్రారంభించింది. మెదక్ ఎంపీ కే.ప్రభాకర్ రెడ్డి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ హెడ్ పీకే సిరాజ్ సమక్షంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టీ.హరీశ్ రావు ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. సిద్దిపేటలోని భరత్‌నగర్‌లో 4,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఈ షోరూమ్ ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణలో మలబార్ షోరూమ్‌ల సంఖ్య 16కు చేరింది.