మనుషులకు మాత్రమే అది సాధ్యం.. మస్క్ ట్వీట్

ABN , First Publish Date - 2022-06-06T03:34:26+05:30 IST

అంగారక గ్రహంపై మానవులు ఆవాసాలు ఏర్పాటు చేయాలన్నది టెస్లా అధినేత ఎలాన్ మస్క్ లక్ష్యం. ఈ విషయాన్ని తరచూ ఆయన తన ట్వీట్లలో ప్రస్తావిస్తూ ఉంటారు. అంతేకాదు..

మనుషులకు మాత్రమే అది సాధ్యం.. మస్క్ ట్వీట్

ఎన్నారై డెస్క్: అంగారక గ్రహంపై మానవులు ఆవాసాలు ఏర్పాటు చేయాలన్నది టెస్లా అధినేత ఎలాన్ మస్క్ లక్ష్యం. ఈ విషయాన్ని తరచూ ఆయన తన ట్వీట్లలో ప్రస్తావిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఆ లక్ష్యానికున్న ప్రాముఖ్యాన్ని కూడా గుర్తు చేస్తుంటారు. ఈ విషయంలో మస్క్ మరోసారి స్పందించారు. మరే ఇతర జీవాలు అంగారక గ్రహానికి వెళ్లలేవన్నారు. మనుషులు మాత్రమే ఆ పని చేయగలడన్నారు. కాబట్టి.. ఈ విషయంలో మానవులు ఇతర జీవాలను నిరాశపరచకూడదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఈ లక్ష్యం దిశగా తాను చేయబోయే కొన్ని ప్రయత్నాలను కూడా చెప్పుకొచ్చారు. అంగారక  గ్రహంపై జీవాన్ని పంపించేందుకు తాను 1000 రాకెట్లను సిద్ధం చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. 





Updated Date - 2022-06-06T03:34:26+05:30 IST