Abn logo
Feb 20 2020 @ 05:26AM

సీఏఏ అమలు కూడదని తీర్మానించండి: మధు

హిందూపురం టౌన్‌, ఫిబ్రవరి 19: ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదు. ఆ మేరకు శాసనసభలో వైసీపీ, టీడీపీ తీర్మానం చేయాలి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ, బహిరంగసభకు ఆయన హాజరయ్యారు. 


Advertisement
Advertisement
Advertisement