కుమార్తెపై అత్యాచారం కేసులో తండ్రికి పదేళ్ల జైలు

ABN , First Publish Date - 2021-04-10T22:28:33+05:30 IST

మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటనలో 41 ఏళ్ల తండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమాన విధించింది. బాలికకు పద్నాలుగేళ్ల వయసున్నపుడు

కుమార్తెపై అత్యాచారం కేసులో తండ్రికి పదేళ్ల జైలు

ముంబై: మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటనలో 41 ఏళ్ల తండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమాన విధించింది. బాలికకు పద్నాలుగేళ్ల వయసున్నపుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తండ్రితోపాటే ఉంటోంది. ఈ క్రమంలో బాలికపై పదేళ్ల వయసు నుంచి అపుడపుడు అత్యాచారానికి పాల్పడేవాడు. బాధిత బాలిక అనారోగ్యం బారిన పడడంతో స్థానిక హెల్త్ సెంటర్‌కి వెళ్లింది. పరీక్షించిన వైద్యలు గర్భవతి అని తేల్చడంతో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు న్యాయమూర్తి కవితా డి శిర్భతే పదేళ్ల కఠిన కారగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Updated Date - 2021-04-10T22:28:33+05:30 IST