మహానాడు తీర్మానాలు

ABN , First Publish Date - 2020-05-29T08:57:03+05:30 IST

‘‘ఎన్టీఆర్‌ 292 సినిమాల్లో నటించారు. తన పాత్రల ద్వారా సమాజానికి సందేశం ఇచ్చారు. సీఎన్‌ ఎన్‌ -ఐబీఎన్‌.

మహానాడు తీర్మానాలు

‘‘ఎన్టీఆర్‌ 292 సినిమాల్లో నటించారు. తన పాత్రల ద్వారా సమాజానికి సందేశం ఇచ్చారు. సీఎన్‌ ఎన్‌ -ఐబీఎన్‌. నిర్వహించిన నేషనల్‌ పోల్‌లో ‘గ్రేటెస్ట్‌ ఇండియన్‌  యాక్టర్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’గా ఎన్టీఆర్‌ ఎంపికయ్యారు. 9 నెలల్లోనే పార్టీని గెలిపించి కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టారు. ఎన్టీఆర్‌ పంచెకట్టు, భాష, సంప్రదాయం తెలుగు జాతి విశిష్టతకు గీటు రాళ్లు. హ్యూమనిజమే నా యిజం... సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌’’


చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ మహానాడులో గురువారం చర్చకు చేపట్టిన అంశాలు.. వాటిపై తీర్మానాలు

1) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ 

రామారావు జయంతి సందర్భంగా పార్టీ 

ఆయనకు ఘన నివాళులు అర్పించింది. 

ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం 

చేసింది.

2) రాష్ట్రంలో అరాచక పాలన...

క్షీణిస్తున్న శాంతిభద్రతలు:

పోలీస్‌ వ్యవస్థ నిష్పాక్షికంగా 

వ్యవహరించాలని టీడీపీ కోరింది. అధికార 

పార్టీ ఎజెండాకు అనుగుణంగా కక్ష 

సాధింపులకు పాల్పడితే ఊరుకొనేది లేదని,

టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు

ఎత్తివేయాలని తీర్మానంలో పేర్కొంది.

3) పార్టీ సంస్థాగత నిర్మాణం

కష్టకాలంలో వీడి వెళ్లిన వారిని 

వీలైనంతవరకూ తిరిగి పార్టీలోకి 

తీసుకోరాదని తీర్మానించారు. ప్రతిపక్షంలో 

ఉండి పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని, 

బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి 

పదవుల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని 

నిర్ణయించింది. 

4) అవినీతి, జె ట్యాక్స్‌పై పోరు

అవినీతికి వ్యతిరేకంగా బలంగా పోరాడాలని 

పార్టీ నిర్ణయించింది.

5) ధరల పెరుగుదల

కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల 

ధరల అదుపునకు ప్రభుత్వం కృషి చేయాలి. 

బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలి.

6) రాజధాని అమరావతి

రాష్ట్ర రాజధానిగా అమరావతిని 

కొనసాగించాలి. ఈమేరకు ప్రభుత్వం 

బహిరంగ ప్రకటన చేయాలి.

7) బలిపీఠంపై బడుగుల సంక్షేమం

రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమం బలిపీఠం 

ఎక్కిందని తెలుగుదేశం పార్టీ ఆందోళన 

వ్యక్తం చేసింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 

కార్పొరేషన్ల ద్వారా అర్హులందరికీ సాయం 

అందించాలని కోరింది. ఒక పథకం నిధులు 

మరో దానికి మళ్లించకూడదు. 

8) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారో ప్రజలకు 

వివరించాలి. ఆ డబ్బును శాశ్వత నిర్మాణాలు.. 

ప్రాజెక్టుల వంటి వాటికే ఖర్చు చేయాలి. 

ప్రజలపై అమితమైన అప్పుల భారం 

మోపకూడదు.

9) రాజకీయ తీర్మానం

కేంద్రంలో ప్రభుత్వానికి అంశాల ప్రాతిపదికన 

మద్దతు ఇవ్వాలి. చైనా దుందుడుకు 

వ్యవహారంలో కేంద్రం తీసుకొనే నిర్ణయానికి 

మద్దతు తెలిపాలి.


తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న చంద్రబాబు, యనమల, బొండా, సోమిరెడ్డి తదితరులు

Updated Date - 2020-05-29T08:57:03+05:30 IST