మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం జడ్పీ హైస్కూల్‌లో పాము కలకలం రేగింది. పార్కింగ్ చేసిన స్కూటీలోకి పాము వెళ్లింది. దీంతో పామును తీసేందుకు బాధితులు స్కూటీ ఇంజన్‌ను విప్పారు. తంటాలు పడి ఎట్టకేలకు స్థానికులు పామును బయటకు తీశారు. కాగా... బడి ఆవరణలోకి పాము రావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.