Abn logo
Nov 26 2021 @ 08:06AM

Mahabubabad: ఏజెన్సీ వాసులను వీడని పులి భయం

మహబూబాబాద్:  ఏజన్సీ వాసులను పులి భయం వీడటం లేదు.  మూడు వారాలుగా ములుగు, మహబూబాబాద్ అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. పదుల సంఖ్యలో పశువులను పులి హతం చేసింది. పలువురు పశువుల కాపరులపై దాడికి యత్నించింది. ఇంత జరుగుతున్పప్పటికీ  అప్రమత్తంగా ఉండాలని  అధికారులు  సూచించి వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. పులిని బంధించేందుకు అధికారులు  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆదివాసి గూడాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. అటవీ గ్రామాల ప్రజలు   పులి ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని భయం భయంగా గడుపుతున్నారు.  తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఆవుల మందపై పులి దాడి చేసింది.  గూడూరు మండలం నేలవంచ, కార్లాయి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందాయి.