మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహులపేట మండలం వస్రం తండ స్టేజీ సమీపంలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి