బురద నీటిలోనే పుణ్యస్నానాలు...రాజమండ్రిలో భక్తుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-02-21T17:06:26+05:30 IST

బురద నీటిలోనే పుణ్యస్నానాలు...రాజమండ్రిలో భక్తుల ఇక్కట్లు

బురద నీటిలోనే పుణ్యస్నానాలు...రాజమండ్రిలో భక్తుల ఇక్కట్లు

రాజమండ్రి: మహాశివరాత్రిని పురస్కరించుకుని గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే గోదావరిలో నీటి మట్టం తగ్గటం వల్ల బురద నీటిలోనే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్‌లో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. మహాశివరాత్రి కోసం నిన్న డొంకరాయి రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు సీలేరు జలాలు రాజమండ్రికి చేరుకునే అవకాశం ఉంది. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులుకు గురవుతున్నారు. స్నానఘట్టాల్లోనూ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. 



Updated Date - 2020-02-21T17:06:26+05:30 IST