లక్నో సూపర్ జెయింట్స్‌లోకి జింబాబ్వే పేసర్. మార్క్‌వుడ్ స్థానంలో భర్తీ

ABN , First Publish Date - 2022-03-22T22:23:12+05:30 IST

ఐపీఎల్‌లోఈసారి అరంగేట్రం చేయబోతున్న నయా ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ మరో కొత్త ఆటగాడిని జట్టులోకి

లక్నో సూపర్ జెయింట్స్‌లోకి జింబాబ్వే పేసర్. మార్క్‌వుడ్ స్థానంలో భర్తీ

లక్నో: ఐపీఎల్‌లో ఈసారి అరంగేట్రం చేయబోతున్న నయా ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ మరో కొత్త ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానితో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.


అయితే, అతడిని ఎంతకు కొనుగోలు చేసిందన్న వివరాలు వెల్లడించలేదు. ఐపీఎల్ మెగా వేలంలో మార్క్ వుడ్‌ను లక్నో రూ. 7.5 కోట్లకు సొంతం చేసుకుంది. లక్నో తన తొలి మ్యాచ్‌లో మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌తో ఈ నెల 28న తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఇందుకు వేదిక కానుంది.

Updated Date - 2022-03-22T22:23:12+05:30 IST