ఆర్సీబీపై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

ABN , First Publish Date - 2022-04-20T00:40:30+05:30 IST

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఆర్సీబీపై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

ముంబై: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఆరేసి మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలతో మూడునాలుగు స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా స్థానాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

Updated Date - 2022-04-20T00:40:30+05:30 IST