Lovlina Borgohain: కామన్‌వెల్త్ క్రీడలకు ముందు సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2022-07-26T02:45:45+05:30 IST

టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) సంచలన వ్యాఖ్యలు చేసింది. కామన్‌వెల్త్ గేమ్స్‌

Lovlina Borgohain: కామన్‌వెల్త్ క్రీడలకు ముందు సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) సంచలన వ్యాఖ్యలు చేసింది. కామన్‌వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games 2022)కు ముందు తాను మానసిక వ్యధ అనుభవిస్తున్నట్టు పేర్కొంది. తాను చాలా బాధగా ఉన్నట్టు పేర్కొన్న లవ్లీనా.. చాలా వేధింపులు ఎదుర్కొన్నట్టు పేర్కొంటూ ట్వీట్ చేసింది.


ఒలింపిక్స్‌లో తాను పతకాలు గెలవడానికి సాయం చేసిన కోచ్‌లను ప్రతిసారి పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన సంధ్య గురుంగ్ (Sandhya Gurung) కూడా ఉన్నారని పేర్కొంది. వేలాదిసార్లు అభ్యర్థించినా నా శిక్షణ కోసం వారిని ఆలస్యంగా అనుమతిస్తున్నారని పేర్కొంది. ఇది తన శిక్షణకు తీవ్ర ఆటంకం కలిగిస్తోందని, మానసిక వేధింపులకు గురిచేస్తోందని పేర్కొంది. 


ఇప్పుడు తన కోచ్  సంధ్యా గురుంగ్‌జీని కామన్వెల్త్ విలేజ్‌లోకి ప్రవేశించడానికి అనుమంతిచకపోవడంతో ఆమె వెలుపలే ఉందని లవ్లీనా ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడల ప్రారంభానికి వారం రోజుల ముందు తన శిక్షణ నిలిచిపోయిందని పేర్కొంది. తానా చాలాసార్లు అభ్యర్థించినప్పటికీ తన ఇతర కోచ్‌లను కూడా భారత్‌కు తిరిగి పంపించేశారని తెలిపింది.


ఇప్పుడు ఆటపై ఎలా దృష్టిపెట్టాలో అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేసింది. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే తన ప్రదర్శనను నాశనం చేశాయని వివరించింది. ఈ రాజకీయాలు తన కామన్వెల్త్ క్రీడలను నాశనం చేయకూడదనుకుంటున్నానని, ఈ రాజకీయాలను ఛేదించి దేశానికి పతకం సాధించగలనని ఆశిస్తున్నానని పేర్కొంటూ.. జై హింద్ అని పోస్టును ముగించింది. 



Updated Date - 2022-07-26T02:45:45+05:30 IST