ఆ పార్టీల అసలు రంగు బయటపడనుంది:విజయశాంతి
హైదరాబాద్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, మజ్లిస్ కవల పార్టీలకు కమలం పరీక్ష ఎదురైందని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. 100 డివిజన్లు ఖాయమని జబ్బలు చరిచిన టీఆర్‌ఎస్.. చివరకు 56 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని విమర్శించారు.
గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ అవసరంలేదని చెప్పిన టీఆర్‌ఎస్ నేతలకు ఇప్పుడు ఆ పార్టీ మద్దతు లేకుండా మేయర్ పదవి దక్కే అవకాశం లేదన్నారు. తాము తలుచుకుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని 2 నెలల్లో కూల్చుతామని బీరాలు పలికిన మజ్లిస్ నేతలు, మేయర్ పీఠంపై అదే మాట మీద ఉంటారా? అని ప్రశ్నించారు. కవల పార్టీల అసలు రంగు బయటపడే సమయం ఆసన్నమైందన్నారు.