మోదీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా: ఇజ్రాయెల్ కొత్త ప్రధాని

ABN , First Publish Date - 2021-06-16T05:16:54+05:30 IST

భారత ప్రధాని మోదీతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నానని ఇజ్రాయెల్ నూతన ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ అన్నారు.

మోదీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా: ఇజ్రాయెల్ కొత్త ప్రధాని

జెరూసలేం: భారత ప్రధాని మోదీతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నానని ఇజ్రాయెల్ నూతన ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక, సహృదయ బంధాలను మరింత అభివృద్ధి చేయడానికి మోదీతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ హయానికి ఆ దేశంలో ముగింపు పలికారు. అనంతరం నఫ్తాలీ బెన్నెట్ ఆ పదవి కోసం పోటీ పడి ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన్ను మోదీ అభినందించారు. ఇజ్రాయెల్ ప్రధాని అయినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపుతూ సందేశం పంపారు. దీనిపై స్పందించిన నఫ్తాలీ మోదీతో కలిసి ఇరుదేశాల బంధాల అభివృద్ధి కోసం పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-06-16T05:16:54+05:30 IST