మార్చికి కూడా ఫిబ్రవరి బిల్లే వర్తింపు: డిస్కమ్స్‌

ABN , First Publish Date - 2020-04-03T07:19:01+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్తు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీసి, బిల్లులు ఇవ్వకుండా ఫిబ్రవరి బిల్లునే మార్చి నెలకూ వర్తింపజేస్తూ వినియోగదారులకు ఎస్‌ఎంఎ్‌సలు పంపాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి.

మార్చికి కూడా ఫిబ్రవరి బిల్లే వర్తింపు: డిస్కమ్స్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్తు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీసి, బిల్లులు ఇవ్వకుండా ఫిబ్రవరి బిల్లునే మార్చి నెలకూ వర్తింపజేస్తూ వినియోగదారులకు ఎస్‌ఎంఎ్‌సలు పంపాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌స ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించనున్నారు. ఈఆర్సీ ఆమోదించగానే ఎస్సెమ్మెస్‌ రూపంలో బిల్లు వివరాలు పంపుతారు. కాగా.. వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు ఓ ప్రకటనలో కోరారు.

Updated Date - 2020-04-03T07:19:01+05:30 IST