Advertisement
Advertisement
Abn logo
Advertisement
May 21 2021 @ 19:43PM

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలి: కేసీఆర్‌

వరంగల్: హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఉదయం 10 గంటల తర్వాత అనుమతి పొందిన వారు మినహా మరెవ్వరూ వీధుల్లో ఉవద్దని చెప్పారు. హైదరాబాద్‌లోని అన్ని ఆస్పత్రులను శుభ్రపరిచి లైట్లు ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేసిన రాత్రి కర్ఫ్యూ సత్ఫలితాలివ్వకపోవడంతో ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 21 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. 21 నుంచి మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే దానిపై 20న మరోసారి కేబినేట్‌ సమావేశమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కేబినేట్‌ సమావేశం జరగలేదు. సీఎం కేసీఆర్‌ మంత్రులతో మాట్లాడి 21 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.   


Advertisement
Advertisement