Abn logo
Aug 1 2020 @ 05:47AM

మడికొండలో నేటి నుంచి లాక్‌డౌన్‌

మడికొండ, జూలై 31: రోజు రోజుకూ వైరస్‌  విజృంభిస్తున్న తరుణంలో  33, 34, 53 డివిజన్ల పరిధిలోని మడికొండలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలుకు తీర్మానం చేశారు. శుక్రవారం స్థానిక మునిసిపల్‌  కార్యాలయ ఆవరణలో కార్పొరేటర్లు జోరిక రమేష్‌, తొట్ల రాజుయాదవ్‌, లింగం మౌనిక చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు బైరి కొమురయ్య, మూల అయిలయ్య, పల్లపు రాజేందర్‌, వస్కుల శంకర్‌, పొనగోటి వెంకట్రావు, బుర్ర శ్రీధర్‌ తదితరులు ప్రజలతో సమావేశమై లాక్‌డౌన్‌ విధివిధానాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి 31 తేదీ వరకు నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటుందన్నారు. కిరాణాలు, కూరగాయల దుకాణాలు, చికెన్‌, మటన్‌ షాపులు, లాండ్రీ, సెలూన్‌, హోటళ్లు ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, సిమెంట్‌, ఐరన్‌, శానిటరీ, హార్డ్‌వేర్‌, ఎలక్ర్టికల్‌, బట్టలు, మొబైల్‌ షాపులు, వైన్‌షాపులు ఇతరత్రా వ్యాపార, వాణిజ్య దుకాణాలు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు.  

Advertisement
Advertisement