ఆకలి కేకలతో అలమటిస్తున్న అన్నార్థుల విన్నపం

ABN , First Publish Date - 2021-05-18T18:29:07+05:30 IST

లాక్ డౌన్ ఎఫెక్టుతో రెక్కాడితో గానీ డొక్కాడని బతుకులు.. ఆకలి కేకలతో అలమటిస్తున్నాయి.

ఆకలి కేకలతో అలమటిస్తున్న అన్నార్థుల విన్నపం

హైదరాబాద్: లాక్ డౌన్ ఎఫెక్టుతో రెక్కాడితో గానీ డొక్కాడని బతుకులు.. ఆకలి కేకలతో అలమటిస్తున్నాయి. హైదరాబాద్‌లో అన్నపూర్ణ కేంద్రాల్లో రూ. 5 చెల్లించే స్తోమత కూడా లేనందున ఉచితంగా భోజనం అందించాలని అన్నార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో అందించిన మాదిరిగా రెండు పూటల అన్నం పెట్టాలని వేడుకుంటున్నారు. పేదవాడి ఆకలి తీర్చే రూ. 5 భోజనం లాక్ డౌన్ సమయంలో ఏ మాత్రం సరిపోవడం లేదని అన్నార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్‌తో ఉపాధి కరువైందని చేతిలో చిల్లిగవ్వ లేనందున ఉచితంగా భోజనం అందించాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-05-18T18:29:07+05:30 IST