స్టేషన్‌ఘన్‌పూర్: లోలెవల్ కాజ్‌వేపై వరదనీటిలో చిక్కుకున్న గాదె ప్రభాకర్ అనే వ్యక్తిని స్థానికులు రక్షించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన గాదె ప్రభాకర్ తన కిరాణం దుకాణం కోసం పాల ప్యాకెట్లతో పాటు, నిత్యావసర వస్తువులను తీసుకురావడానికి మంగళవారం ఉదయం స్కూటీపై ఘన్‌పూర్‌కు వెళ్లాడు. సామాన్లు తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో కాజ్‌వే మీద వరద తీవ్రత ఎక్కువ కావడంతో స్కూటీ పడిపోయింది. ప్రభాకర్ కాజ్‌వే దిమ్మెను ఆసరాగా పట్టుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు తాడు వేసి వరద నుంచి బయటకు లాగారు. స్కూటీ మాత్రం వరదలో కొట్టుకుపోయింది.