AP: రూ.23 లక్షల విలువైన మద్యం ధ్వంసం

ABN , First Publish Date - 2022-07-23T12:44:27+05:30 IST

తుని పరిధిలో ఇటీవల పట్టుబడ్డ రూ.23 లక్షల విలువైన 20,873 మద్యం సీసాలను జిల్లా పోలీసు ఉన్నతాధికా రులు ధ్వంసం చేశారు. శుక్రవారం తేటగుంట శివారు

AP: రూ.23 లక్షల విలువైన మద్యం ధ్వంసం

తూర్పు గోదావరి: తుని పరిధిలో ఇటీవల పట్టుబడ్డ రూ.23 లక్షల విలువైన 20,873 మద్యం సీసాలను జిల్లా పోలీసు ఉన్నతాధికా రులు ధ్వంసం చేశారు. శుక్రవారం తేటగుంట శివారు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌, అడిషన్‌ ఎస్పీ, డిస్ట్రిక్ట్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెట్‌ ఆఫీసర్‌ ఎం.జయరాజుతో పాటు పోలీస్‌, ఎస్‌ఈబీ అధికారులు పాల్గొన్నారు. అక్రమ మద్యం సీసా లను నేలపైపరచి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యంపై చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు, యువతకి పరివర్తన ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యక్రమా లకు దూరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రూర ల్‌ సీఐ సన్యాసిరావు, ఎస్‌ఐ ఎ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-23T12:44:27+05:30 IST