పొడి చర్మానికి ఇలా..!

ABN , First Publish Date - 2021-10-11T05:30:00+05:30 IST

డ్రై స్కిన్‌ ఉన్న వారు చర్మసంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హోమ్‌ మేడ్‌ ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగించడం ద్వారా పొడి చర్మం...

పొడి చర్మానికి ఇలా..!

డ్రై స్కిన్‌ ఉన్న వారు చర్మసంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హోమ్‌ మేడ్‌ ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగించడం ద్వారా పొడి చర్మం పునరుత్తేజం పొందేలా చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌లు ఎలా తయారుచేసుకోవాలంటే...

అరటిపండులో పొటాషియంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొడి బారిన చర్మానికి పునరుత్తేజాన్ని అందిస్తాయి. ఒక అరటిపండును తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి మెత్తటి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు, మూడు రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అరకప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె కలిపి పేస్టులా తయారుచేసి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. వారంలో మూడు సార్లు ఈ ప్యాక్‌ని అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. నిగారింపు సంతరించుకుంటుంది.

 కొద్దిగా ఓట్స్‌ తీసుకుని పాలల్లో నానబెట్టాలి. తరువాత అందులో కొద్దిగా తేనె వేసి మెత్తటి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలి. కొద్దిగా ఆరిన తరువాత నెమ్మదిగా వేళ్లతో మర్దన చేయాలి. పూర్తిగా ఆరిన తరువాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

Updated Date - 2021-10-11T05:30:00+05:30 IST