Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 25 Jun 2022 19:55:12 IST

ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చిన ‘లైఫ్‌స్టైల్’

twitter-iconwatsapp-iconfb-icon
ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చిన లైఫ్‌స్టైల్

న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ ఫ్యాషన్ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్ (Lifestyle) తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సేల్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. 50 శాతం రాయితీతోపాటు మరెన్నో ఆకర్షించే డీల్స్ ప్రకటించింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లపై ఈ రాయితీలు లభిస్తాయని తెలిపింది. ఫోర్కా, జింజర్‌, మెలాంజ్‌, కప్పా, కోడ్‌,  ఫేమ్‌ ఫరెవర్‌ వంటి ప్రముఖ బ్రాండ్లపైనా ఆఫర్లు వర్తిస్తాయి. 


వీటితో పాటు సుప్రసిద్ధ బ్రాండ్లు అయిన వెరోమొడా, లెవిస్‌, పుమా, లోరెల్‌, టైటాన్‌, బిబా, ఓన్లీ, లూయిస్‌ ఫిలిప్పి, టామీ హిల్‌ఫిగర్‌, వాన్‌ హ్యుసెన్‌, యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌ వంటి వాటిపైనా రాయితీలు అందుకోవచ్చని లైఫ్‌స్టైల్ తెలిపింది. దుస్తులు, బ్యూటీ, వాచీలు, ఫ్రాగ్రాన్స్‌, ఫుట్‌వేర్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌, యాక్సెసరీలపైనా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 7 వేల విలువైన షాపింగ్ చేసిన వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే, లైఫ్‌స్టైల్ స్టోర్లతోపాటు lifestylestores.com ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ప్లే స్టోర్ ద్వారా లైఫ్‌స్టైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో శరత్ సిటీ, బేగంపేట, మంజీరామాల్, ఇనార్బిట్ మాల్, ఎల్ అండ్ టీ ఇర్రమ్ మంజిల్, మూసారాంబాగ్ వద్ద లైఫ్‌స్టోర్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.