Advertisement
Advertisement
Abn logo
Advertisement

3 నెలలు ఆగాల్సిందే..

  • కరోనా నుంచి కోలుకున్న తర్వాత
  •  జీవిత బీమా కొనుగోలుకు వెయిటింగ్‌ పీరియడ్‌ 

న్యూఢిల్లీ: కరోనా బారినపడి కోలుకున్న వారు కొత్తగా జీవితా బీమా పాలసీ కొనుగోలు చేసేం దుకు కనీసం మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇతర జబ్బులకు మాదిరిగానే కరోనా కేసులకూ వెయిటింగ్‌ పీరియడ్‌ను నిర్దేశించాయి. సాధారణంగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీ కంపెనీలు ఏదైనా జబ్బు లేదా వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులకు నిర్దేశిత వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాతే కొత్త పాలసీని విక్రయి స్తాయి. పాలసీ విక్రయానికి ముందు రిస్క్‌ను అంచనా వేసేందుకు అనుసరించే ప్రామాణిక పద్ధతుల్లో వెయిటింగ్‌ పీరియడ్‌ ఒకటి. అయితే, కరోనా నుంచి కోలుకున్న వారికి మాత్రం జీవిత బీమా పాలసీ కొనుగోలుకు మాత్రమే వెయిటింగ్‌ పీరియడ్‌ వర్తిస్తుంది. కరోనా సంక్రమణ కారణంగా మరణాల రేటు అధికంగా ఉండటం వల్లే ఈ నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. కరోనా కేసులను కూడా స్టాండర్డ్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనీ రీఇన్సూరెన్స్‌ కంపెనీలు బీమా సంస్థలను కోరినట్లు వారు తెలిపారు. ఎందుకంటే, బీమా సంస్థల పథకాలకు రిస్క్‌ కవరేజీ కల్పించేది రీఇన్సూరెన్స్‌ కంపెనీలే. రెండో దశ వ్యాప్తిలో కరోనా మరణాల రేటుతో పాటు క్లెయిమ్‌లు కూడా భారీగా పెరగడంతో రీఇన్సూరెన్స్‌ వ్యాపారంపై ప్రభావం చూపింది.  

Advertisement
Advertisement