ఎల్‌ఐసీ ప్రథమార్ధ లాభం రూ.1,437 కోట్లు

ABN , First Publish Date - 2022-01-26T06:52:53+05:30 IST

మరికొద్ది రోజుల్లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.1,437 కోట్ల లాభాన్ని ప్రకటించింది....

ఎల్‌ఐసీ ప్రథమార్ధ లాభం  రూ.1,437 కోట్లు

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో పబ్లిక్‌ ఇష్యూకి  వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.1,437 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.6.14 కోట్లు. ఇదే కాలంలో కొత్త ప్రీమి యం ఆదాయం భారీ స్థాయిలో 554.1 శాతం పెరిగింది. ప్రీమియంల ద్వారా సమకూరిన నికర ఆదాయం రూ.1,679 కోట్ల నుంచి రూ.1.86 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ప్రీమియంల ద్వారా ఆదాయం ఒక్కసారిగా రూ.17,404 కోట్లు పెరిగిందని ఎల్‌ఐసీ ప్రకటించింది. పెట్టుబడుల ద్వారా ఆదాయం రూ.3.35 లక్షల కోట్లుగా నమోదైంది. ఎల్‌ఐసీ షేర్‌ క్యాపిటల్‌ రూ.6,325 కోట్లుగా నమోదైంది. సంస్థ నికర రిటెన్షన్‌ నిష్పత్తి 99.88 శాతం ఉంది. 

Updated Date - 2022-01-26T06:52:53+05:30 IST