లాభదాయక మద్దతు ధర నిర్ణయించండి
ABN , First Publish Date - 2021-11-21T08:09:39+05:30 IST
మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం పట్ల తెలంగాణ రైతు రక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది.
- ప్రధానికి తెలంగాణ రైతు రక్షణ సమితి లేఖ
హైదరాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం పట్ల తెలంగాణ రైతు రక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది. రైతులకు మేలు జరిగే ఆరు అంశాల్లో నిర్ణయాలను ప్రకటించాలని కోరుతూ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పా కాల శ్రీహరిరావు శనివారం ప్రధానికి ఒక లేఖ రాశారు. వ్యవసాయ ఉత్పత్తులకు లాభదాయకంగా ఉండేలా మద్దతు ధరను నిర్ణయించాలన్నారు.