మార్చుకోండిలా...

ABN , First Publish Date - 2021-02-25T05:51:48+05:30 IST

పాత అలవాట్లను వదిలించుకోవడం కూడా అంత సులభం కాదు. ‘నా వల్ల

మార్చుకోండిలా...

 అలవాట్లను ఒకేసారి మార్చుకోలేరు. ఒక కొత్త అలవాటు మీ జీవితంలో భాగం కావాలంటే కొంత సమయం పడుతుంది. అంతవరకు ఓపికగా ప్రయత్నించాలి.


 పాత అలవాట్లను వదిలించుకోవడం కూడా అంత సులభం కాదు. ‘నా వల్ల కాదు’ అని అనుకోకుండా, ప్రయత్నిస్తే సాధ్యమే అనుకోవాలి. పాజిటివ్‌గా ఉండటం అలవర్చుకోవాలి.


 ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకండి. మంచి అలవాట్లు మీ జీవితంలో భాగం కావాలంటే అది తప్పనిసరి.


 మంచి అలవాట్లను పెంచుకునే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటో గుర్తించండి. వాటిని అధిగమించడానికి ఉన్న మార్గాలను అన్వేషించండి.


 స్నేహితుల సహకారం, కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉంటే అలవాట్లను మార్చుకోవడం సులభమే. ఈ విషయంలో మొహమాట పడకుండా వారి సహకారం తీసుకోండి.     


ఒక మంచి అలవాటును మీ జీవితంలో ఒక భాగంగా చేసుకునే ముందు దాని ప్రాధా న్యం ఏమిటో, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అది ఎలా ఉపయోగపడుతుందో గుర్తించండి. 


Updated Date - 2021-02-25T05:51:48+05:30 IST