Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రాలయం నియోజకవర్గంలో చిరుత పులుల కలకలం

కర్నూలు: మంత్రాలయం నియోజకవర్గంలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. పెదకడబూరు, కౌతాలం, కొసిగి మండలాల్లో చిరుతల సంచారం ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గొర్రెలను మేపేందుకు కాపలాదారులు హడలిపోతున్నారు. రెండు నెలల క్రితం పులి కనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులులను చూసిన గొర్రెల కాపలాదారులు పరుగులు తీశారు. రెండు గొర్రెలను చిరుతలు చంపి తిన్నాయి. కొసిగి మండలంలోని పొలాల్లోనూ చిరుతలు సంచరిస్తున్నాయని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్ని చిరుత పులులు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అడపాదడపా ప్రతీసారి పులులు కనపడటం, గొర్రెలను చంపడం కామన్‌గా మారిపోయింది.


Advertisement
Advertisement