హైదరాబాద్: ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు

ABN , First Publish Date - 2020-06-03T18:20:17+05:30 IST

నగర శివారులను చిరుత వణికిస్తోంది.

హైదరాబాద్: ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు

హైదరాబాద్: నగర శివారులను చిరుత వణికిస్తోంది. రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుత మళ్లీ కనిపించింది. రాజేంద్రనగర్ పోలీస్ అకాడమి పరిసరాల్లో చిరుత ఇంకోసారి కనిపించింది. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. ఆహారం, నీరు పుష్కలంగా లభిస్తుండడంతో చిరుత అడవిలోనే ఉందని భావిస్తున్నారు. అయితే చిరుత మళ్లీ కనిపించిందన్న సమాచారం స్థానికుల్లో గుబులు రేపుతోంది. అయితే రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో చిరుత కోసం అధికారుల ఆపరేషన్ కొనసాగుతోంది.

Updated Date - 2020-06-03T18:20:17+05:30 IST