ప్రముఖ జర్నలిస్టు, రచయిత పాలపర్తి ప్రసాద్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-11-10T09:04:16+05:30 IST

ప్రముఖ జర్నలిస్టు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్‌ (88) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు.

ప్రముఖ జర్నలిస్టు, రచయిత పాలపర్తి ప్రసాద్‌ కన్నుమూత

హైదరాబాద్‌, నవంబరు 9: ప్రముఖ జర్నలిస్టు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్‌ (88) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ప్రసాద్‌ తల్లిదండ్రులు కృష్ణమూర్తి, తామ్రపర్ణి. ఆయన విద్యాభ్యాసం అంతా అప్పటి మద్రాసులో జరిగింది. ఆంధ్రపత్రిక ఎడిటర్‌గా ఆయన పదవీవిరమణ చేసిన అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన కలం నుంచి అనేక చారిత్రక నవలలు వెలువడ్డాయి. సాహిత్య రంగంలో ప్రసాద్‌గా మంచి పేరుగడించిన ఆయన కలం నుంచి రోషనారా, అక్బర్‌, ఆర్యచాణక్య, పృథ్వీరాజ్‌, షాజహాన్‌ వంటి నవలలు జాలువారాయి. సినిమా రంగంలో ఆయనకు మంచి మిత్రులు ఉన్నారు. గత 15 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రచారానికి, పురస్కారాలకు ఆయన దూరంగా ఉండేవారు.  నడుస్తున్న నిఘంటువు, రాజకీయ విశ్లేషకులు, మితభాషి, మంచి రచయిత, మంచి పాత్రికేయుడు అని ఆయనను పలువురు కొనియాడారు. పలువురు పాత్రికేయులు, సాహితీ మిత్రులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2021-11-10T09:04:16+05:30 IST